22-05-2025 07:10:18 PM
జిల్లా బాక్సింగ్ ప్యాట్రాన్ యెర్రా కామేష్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈనెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మంచిర్యాల జిల్లాలో జరగనున్న టైసన్ కప్ ఓపెన్ రాష్ట్ర స్థాయి పోటీ(Tyson Cup Open State Level Competition)ల్లో పాల్గొనే జిల్లా జట్టును గురువారం బాక్సింగ్ జిల్లా ప్యాట్రన్ యెర్రా కామేష్(Boxing District Patron Yerra Kamesh) ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మే నెల 1వ తేదీ నుండి స్థానిక ప్రగతి మైదానంలో జరుగుతున్న బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర స్థాయిలో జరిగే బాక్సింగ్ పోటీలలో భాగంగా సబ్ జూనియర్స్ విభాగం నుండి గోనెల నిశాంత్ కుమార్, దాసరి హేమంత్, రాచకట్ల వినయ్, బొల్లోజు మహేశ్, ఆముదాల విజయ్ భాగ్యేష్, జూనియర్ విభాగం నుండి జిజుల అజిత్, జూనియర్ విభాగం నుండి గోనెల అక్షయ్ కుమార్ లను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు మంచిర్యాలలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడం జరుగుతుందని రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ జిల్లా జనరల్ సెక్రటరీ వై.శివ సుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు, నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్, పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు షమీఉద్దిన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా, యెర్రా ధనుంజయ్, సుహాష్ అద్వైత్, నున్న శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు.