26-10-2025 12:29:19 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : హైదరాబాద్ నగరాన్ని శుక్రవారం సాయంత్రం వర్షం ముంచెత్తింది. ఉద యం నుంచి ఎండ వున్నా సాయంత్రం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం ఇబ్బందు లకు గురిచేసింది. కార్యాలయాలు, పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే అత్యంత రద్దీ సమయంలో వర్షం దంచికొట్టడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమై, నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
సాయంత్రం చిరుజల్లులతో మొదలైన వర్షం, ఆ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షంగా మారింది. గంటకు పైగా ఏకధాటిగా కురవడంతో, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, సైదాబాద్, చంపాపేట వంటి తూర్పు ప్రాంతాలతో పాటు, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్‌నగర్ వంటి ప్రాం తాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి.
అదేవిధంగా, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహి ల్స్‌తో పాటు మాదాపూర్, గచ్చిబౌలి సహా పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నూ వాన దంచికొట్టింది సరిగ్గా పీక్ అవర్స్‌లో వర్షం కురవడంతో నగర రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు దీరా యి. వాహనదారులు, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో రో డ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది.