26-10-2025 12:30:05 AM
అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌ను కలిసిన రాజ్‌గోకుల్
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ లేజిస్లేచర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా హైకోర్ట్ అడ్వకేట్ తులసి రాజ్ గోకుల్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈమేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. హైకోర్టు న్యాయవాదిగా తులసి రాజ్ గోకుల్ అనుభవం, సలహాలు లెజిస్లేచర్ పాలనా వ్యవహారాలలో ఉపయోగ పడతా -యని స్పీకర్, చైర్మన్, లెజిస్లేటివ్ సెక్రటరీ వి.నరసింహాచార్యులు తెలిపారు.
వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తులసి రాజ్ గోకుల్ నిజాం కాలేజీ నుంచి గ్రాడ్యూయేషన్, పడాల రామిరెడ్డి లా కాలేజీలో లా కోర్స్‌ను పూర్తి చేశారు. గత 30 సంవత్సరాలుగా న్యాయవాదిగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజ్యాంగ బద్దమైన, శాసన వ్యవహారాల్లో నిష్ణాతుడిగా తులసి రాజ్ గోకుల్ అందరికీ సుపరిచితులు.