calender_icon.png 11 August, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో మొదలైన వర్షం.. రోడ్లన్నీ జలమయం!

11-08-2025 07:09:31 PM

హైదరాబాద్‌: హైదరాబాద్‌(Hyderabad Rain)లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్ నగర్, కూకట్ పల్లి, ఎల్బీ నగర్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, పెద్ద అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. అలాగే సికింద్రాబాద్, తార్నాక, అమీర్‌పేట్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, మెహిదీపట్నం, నాగోల్, ఉప్పల్, బీఎన్ రెడ్డి నగర్, కుత్బుల్లాపూర్, చందానగర్, గాజులరామారం, అల్వాల్ ప్రాంతాలలో వర్షం పడుతుంది. వర్షం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.