16-05-2025 11:11:53 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): ఉమ్మడి నిజాంసాగర్ మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు శుక్రవారం నాడు పిట్లం మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో దళిత బందు చెక్కులను జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు అందించారు. అచ్చంపేట గ్రామానికి చెందిన ఆరేటి లక్ష్మికి దళిత బంధు కారును అందజేశారు. కార్యక్రమంలో పిట్లం మార్గ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, తాసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, నాయకులు సంకు లక్ష్మయ్య, బంగ్లా ప్రవీణ్ కుమార్, పండరి, ఎర్రోళ్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.