calender_icon.png 23 July, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వానాకాలం.. విద్యుత్‌తో జరభధ్రం

23-07-2025 12:00:00 AM

బూర్గంపాడు,జూలై22,(విజయక్రాంతి) : భారీ వర్షాలకు ఇంటా.. బయటా.. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ, గాలివానలకు స్తంభాలు పడిపోయి.. విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వాటి బారి నుంచి తప్పించు కోవచ్చని బూర్గంపాడు విద్యుత్ శాఖ ఇంచార్జ్ ఏఈ ఉపేందర్ సూచించారు. విద్యుత్ వాడకం- తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.

వానాకాలంలో ఈదురుగాలులకు, పిడుగులకు విద్యుత్ తీగలు తెగిపడి, స్తంభాలు విరిగిపోయి కరెంట్ సరఫరాలో అంతరాయం లాంటివి ఏర్పడడమే కాక పశువులతో పాటు ప్రజలు ప్రమాద బారిన పడే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ బావుల వద్ద ఉన్న వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడమే కాక, ట్రాన్స్ ఫార్మర్ల వద్దకు వెళ్ళినప్పుడు అనుమతి లేకుండా ప్యూజులు మార్చడం ఇలాంటివి చేయవద్దని సూచించారు.