23-07-2025 12:00:00 AM
అశ్వాపురం, జులై 22(విజయ క్రాంతి): ఉచిత ఇసుక సరఫరాకు అనుమతి కోసం ఎమ్మార్వోకి మంగళవారం వినతి పత్రం అందజేసిన అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక, గ్రావెల్ పొందడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నా రని , ఇసుక దళారుల వద్ద అధిక ధరలు వెచ్చించి ఇసుక కొనుగోలు చేయలేక పోతున్నారని,
ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక సరఫరా లో ఆంక్షలు ఉండడంతో ఇంటి నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, కావున లబ్ధిదారులకు గోదావరి నుండి ఇసుకను ఉచితంగా తోలుకునే అవకాశం కల్పించాలని ఎమ్మార్వో మనిధర్ కు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ ఎంపీటీసీ కమటం నరేష్, మారోజు కృష్ణమాచారి, యువజన నాయకుడు పర్వతా నరేష్, ఇందిరమ్మ లబ్ధిదారులు చెన్నూరి వీరభద్ర, ఉపేందర్, పసుల వెంకటేష్, నరేష్ తదితరులుపాల్గొన్నారు.