calender_icon.png 23 July, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుసారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

23-07-2025 03:40:05 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): నాటుసారా రవాణా సమాచారం మేరకు టేకులపల్లి మండలం(Tekulapalli Mandal) బొమ్మనపల్లి పరిధిలోని కారుకొండ క్రాస్ రోడ్డులో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించిన కొత్తగూడెం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం ద్విచక్ర వాహనం మీద తరలిస్తున్న (40) కేజీల బెల్లం, (02)కేజీల పటిక, (02) లీటర్ల నాటు సారాయి పట్టుకున్నారు. మండలంలోని  బిల్లుడు తండాకు చెందిన  కిషన్ అనే వ్యక్తి మీద కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి బెల్లం, పటిక, నాటుసారా, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డి టి ఎఫ్  ఎస్ ఐ గౌతమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్  సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, వెంకట నారాయణ, సుమంత్, శ్రావణి, రమేష్, పార్థసారథి పాల్గొన్నారు.