11-02-2025 12:00:00 AM
కల్లూరు, ఫిబ్రవరి 10 : కల్లూరు నూతన ఎంపీఓ గా రాజారావు మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు మం డల గ్రామ పంచాయతీ అధికారిగా డిప్యుటేషన్‌పై ఖమ్మం రూరల్ మండలం రఘునాధపాలెం నుంచి కల్లూరుకి వచ్చా రు. ఎంపీఓ రాజారావు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులకు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తానని, కార్యదర్శుల ద్వారా సమస్యలు పరిష్కారం కాకుంటే ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను కార్య దర్శుల ద్వారా పూర్తి చేయిస్తానని ప్రజలకు భరోసా కల్పించారు.