11-02-2025 12:00:00 AM
చింతలపాలెం, ఫిబ్రవరి 10 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడి సత్తా చాటాలని బిఆర్‌ఎస్ మండల పార్టీ నిర్ణయించింది. చింతలపాలెం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాబోయే మండల ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికలలో, అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ బలోపేతం కోసం కలిసి కట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండల కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మధిర సత్యనారాయణ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు మోర్తాల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పోల్నేడి శ్రీనివాసరావు, పెరుగు సుబ్బారావు, గోపిరెడ్డి శివారెడ్డి, పోతంశెట్టి శ్రీనివాసరావు, చిలకల రోశిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కందుల రామకోటిరెడ్డి, షేక్ మైబల్లి, అమర బోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.