08-09-2025 12:04:33 AM
వేములవాడ టౌన్ సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం, దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి. ఆలయం మూసివేశారు. గ్రహణం ప్రారంభానికి ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు, శుద్ధి కర్మలు నిర్వహించిన ఆలయ అర్చకులు, శాస్త్రోక్త విధానాల ప్రకారం ఆల య ద్వారాలను మూసివేశారు.
ఆలయ కార్యనిర్వాహణ అధికారి రమాదేవి తెలిపిన ప్రకారం సోమవారం. ఉదయం 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం స్వామివారి దర్శనాలు యాధావిధి గా ప్రారంభమవుతాయి. చంద్రగ్రహణం హిందూ సనాతన సాంప్రదాయంలో పవిత్ర క్షేత్రాలలో ప్రత్యేక పూజా విధానాలు, శుద్ధి కర్మలు నిర్వహించాల్సిన ముఖ్య సందర్భంగా పరిగ ణించ బడుతుంది. పండితులు ఈ సమయంలో ఇంట్లోనే భజనలు, సత్సంగం, మంత్రపఠనం చేయాలని భక్తులకుసూచిస్తున్నారు.