calender_icon.png 8 September, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు అన్నిరంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలి

08-09-2025 12:02:51 AM

మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి 

కామారెడ్డి, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : విద్యార్థులు కాలానుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని నేర్చుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని,విధిగా మెనూ పాటించాలని గురుకుల పాఠశాల అధికారులకు సూచించారు. పాఠశాలలో బుష్ క్లియర్ చేయాలని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యప్రణాళిక ఎక్కడి వరకు పూర్తయింది అడిగి తెలుసుకున్నారు.

ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకోనీ విజయం దిశగా సాగాలని సూచించారు. విద్యార్థినులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని ,క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.