calender_icon.png 20 August, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ

20-08-2025 07:28:19 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి ఉత్సవాలలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao)తో కలిసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు పాల్గొన్నారు. సత్యనారాయణ రావు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ కృషి చేశారన్నారు. ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీరాజ్ సంస్థలు పునాది అని గుర్తించి వాటిని తిరిగి తెచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశానికి సమాచార సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు అన్నారు.

యువతకు శక్తిని ఇచ్చిన నాయకుడిగా రాజీవ్ గాంధీ ఎప్పటికీ గుర్తుండి పోతారన్నారు. రాజీవ్ గాంధీ టెలి కమ్యూనికేషన్, రక్షణ, వాణిజ్య , విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టి విద్యా అవకాశాలు సమానత్వం కోసం నేషనల్ ఫర్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. యువత ప్రయోజనాల లక్ష్యంగా ఐటీ,విద్యా రంగాలలో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. 61 రాజ్యాంగ సవరణతో ఓటు వేసేందుకు కనీసం వయసు 21 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాల కు తగ్గించిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 40% టికెట్లను యువతకు కేటాయించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవాన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు పాల్గొన్నారు.