21-05-2025 11:01:49 PM
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..
మంథని (విజయక్రాంతి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడ(మంత్రి స్వగ్రామం)లో ఆ మహనీయుడి చిత్రపటానికి శ్రీధర్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మార్గనిర్దేశంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, ఎన్నో మైలురాళ్లను చేరుకుందని వివరించారు. ఆయన స్ఫూర్తితో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.