09-08-2025 09:49:32 PM
ఏరియా జిఎం దేవేందర్..
మందమర్రి (విజయక్రాంతి): అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రాఖీ పండగ అని, అనుబంధాలకు ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్(Raksha Bandhan) వేడుకలను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకొని ఆత్మీయానురాగాలను పెంపొందించాలని సింగరేణి ఏరియా జిఎం జి దేవేందర్(Singareni Area GM G Devender) కోరారు. రక్షా బంధన్ ను పురస్కరించుకొని శనివారం జిఎం కార్యాలయం మహిళా ఉద్యోగులు జిఎం ఛాంబర్లో ఆయనకు రాఖీలు కట్టి రక్షా బంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు. అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని రెండో అక్షరంని కలిపి దేవుడు ఇచ్చిన బంధమే అన్న… అని అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని బాధ్యతను తీసుకునే అన్న జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సోదరీమణి సోదరుని మణికట్టుకు కట్టే రక్ష అని అన్నారు.
సోదర సోదరీ మణులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగే రాఖీ అని, సోదరీ జీవితానికి సోదరుడు ఎప్పుడూ రక్షగా ఉంటాను అని మాట ఇచ్చే రక్షా బంధన్ అని అన్నారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగ రాఖీ పండగ అని వారు అన్నారు.ఈ కార్యక్రమం లో ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారా యణ, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, సివిల్ ఎస్ఇ రాము, ఏఐటీయూసీ స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సివి రమణ, జిఎం ఆఫీస్ పిట్ సెక్రటరీ గీతిక, కార్యాలయ మహిళ ఉద్యోగినులు పాల్గొన్నారు.