09-08-2025 11:16:29 PM
మంగపేట (విజయక్రాంతి): మండలంలోని వాగోడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలో శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ నాగులమ్మ ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ హాజరై ఆదివాసి జెండాను ఎగరవేసి జై ఆదివాసి అను నినాదాలు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ, ఆదివాసి హక్కుల కోసం పోరాటం చేసిన కొమరం భీమ్,బీర్సా ముండా లాంటి గొప్పవారి కీర్తిని పొగిడారు. అనంతరం మిఠాయిలు పంచి ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు ఆదివాసిలు పరస్పరం తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడిశనాగ రమేష్ కొమరం మాధవరావు మడకం రాజేష్,మడకం రమేష్,కోర్స సత్యనారాయణ,కుర్సం సమ్మయ్య,కుర్సం పుల్లయ్య కారం సాంబయ్య,తుర్స పెంటయ్య,దబ్బగట్ల రాఘవులు,మడకం శ్రీకాంత్ చౌలం సాయి బాబు,కొమరం శివాజీ,ఎడం సంజీవ,చీమల రాంబాబు,కారం నరసింహారావు,సోడి సత్యం తదితరులు పాల్గొన్నారు.