09-08-2025 11:15:03 PM
కామారెడ్డి కొత్త బస్టాండ్ ఎదుట సంఘటన..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలోని కొత్త బస్టాండ్ ముందు నిలబడిన వ్యక్తి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అకారణంగా చంపేస్తానని బెదిరించి అతని వద్ద ఉన్న పదివేల రూపాయలు దోచుకెళ్లిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. శనివారం పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం, కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చాకలి సాయిరాం శుక్రవారం ఉదయం 11 గంటలకు బావి మోటర్ కొనడానికి కామారెడ్డికి వచ్చాడని, అయితే అనుకున్న మోటార్ దొరక నందున తిరిగి ఇంటికి వెళ్ళడానికి కొత్త బస్టాండ్ సమీపంలో గల రాధిక హోటల్ వద్ద రాత్రి 10:30కు బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి అతని వద్దకు వచ్చి ఇనుప రాడుతో చంపుతానని బెదిరించి, అతనిని కింద పడవేసి ప్యాంటు జేబులో ఉన్న పదివేల రూపాయలను అపహరించడం జరిగిందని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడానికి సదరు వ్యక్తి భయపడి మరునాడు శనివారం ఉదయం పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ నరహరి తెలిపారు.