calender_icon.png 10 August, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజక్షన్ వికటించి ఒకరు మృతి

09-08-2025 11:19:20 PM

బచ్చన్నపేట (విజయక్రాంతి): ఇంజక్షన్ వికటించి మృతిచెందిన సంఘటన బచ్చన్నపేట మండల(Bachannapet Mandal) కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, గంగరబోయిన బిక్షపతి(45) తనకు ఉదయం ఒళ్ళు నొప్పులు  ఉన్నాయని ఓ ఆర్ఎంపి డాక్టర్ కృష్ణ దగ్గరికి వెళ్లగా ఇంజక్షన్ ఇవ్వడంతో గంట వ్యవధిలోనే మృతి చెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామ ప్రవేట్ హాస్పిటల్ తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని తెలిపారు. బిక్షపతి మేస్త్రి పనిచేస్తూ కుటుంబ పోషిస్తున్నాడు. దీనితో బాధిత కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ డాక్టర్ ఇంటిముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై హమీద్ చేరుకొని ఆర్ఎంపీ డాక్టర్, కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చ చెప్పారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.