09-08-2025 09:39:41 PM
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన సోదరీమణులు..
పటాన్ చెరు (విజయక్రాంతి): సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్(Raksha Bandhan) పండుగను పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకున్నారు. సోదరులకు రాఖీలు కట్టేందుకు వివిధ ప్రాంతాల నుంచి సోదరీమణులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు రాఖీలు కట్టేందుకు సోదరీమణులు వెళ్లారు. రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) ఇంట్లో సంబరాలు వెళ్లి విరిసాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్న వారి సోదరీమణులు నర్సమ్మ, సువర్ణ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో పాటు సోదరుడు మధుసూదన్ రెడ్డిలకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. వీరితో పాటు గూడెం మహిపాల్ రెడ్డి కుమార్తె కొలను రాజేశ్వరి రెడ్డి తమ సోదరుడు గూడెం విక్రం రెడ్డికి రాఖీ కట్టారు.
కీర్తిశేషులు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి కుమార్తె రుధిర, గూడెం విక్రం రెడ్డి కుమార్తె మహిరలు వారి సోదరులు అక్షయ్ రెడ్డి, నిహాన్ రెడ్డి లకు రాఖీలు కట్టారు. కుటుంబమంతా రాఖీ పండుగ సంబరాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు సూచికగా నిర్వహించుకునేది రాఖీ పండగ అని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్ చెరు పట్టణానికి చెందిన ఓం శాంతి బ్రహ్మకుమారీ సంస్థ సభ్యులతో పాటు వివిధ కాలనీలకు చెందిన మహిళలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.