09-08-2025 11:46:57 PM
ఆదివాసీ సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్న కలెక్టర్, ఎస్పీ..
అదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను శనివారం ఘనంగా జరువుకున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లోని బస్టాండ్ ఎదుట నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah), ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) పాల్గొన్నారు. ముందుగా కొమరం భీమ్, రాంజీ గోండు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసులతో కలిసి కలెక్టర్, ఎస్పీలు ఆదివాసీల సంప్రదాయ నృత్యం చేస్తు అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఆదివాసీల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘం నాయకులు పాల్గొన్నారు.