calender_icon.png 9 August, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

09-08-2025 09:51:49 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రాఖీ పండుగను పురస్కరించుకుని మహబూబ్ నగర్ నగరంలోని పాత డీఈఓ కార్యాలయం దగ్గర గల బ్రహాకుమారి ఆశ్రమంలో జరిగిన రాఖీ పండుగ వేడుకల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మహాదేవి తదితరులు ఎమ్మెల్యేకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు రాషెద్ ఖాన్, ఖాజా పాషా, మోసిన్ , ఫయాజ్, అజ్మత్ అలి, పీర్ మహ్మద్ సాదిక్, అలి, తదితరులు పాల్గొన్నారు.