09-08-2025 11:21:15 PM
ముత్తారం: మండల కేంద్రంలోని ముత్తారం గ్రామానికి చెందిన బండ మల్లమ్మ(104) శతాబ్ది వృద్ధురాలు శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు నరసింహ రెడ్డి, రాంరెడ్డి, కూతురు వెల్మరెడ్డి రాధమ్మ ఉన్నారు. మల్లమ్మ మనుమరాళ్లు, మూనిమనమరాళ్లను చూసింది. దీంతో ఆమె వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆమె అంతిమయాత్రలో మనుమలు, మునిమనవలు పాల్గొని కన్నీటి పర్యంతం అయ్యారు. గ్రామస్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.