calender_icon.png 10 August, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసులు దాడి

09-08-2025 11:32:46 PM

అలంపూర్: పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఏడుగురుని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉండవల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శేఖర్(SI Shekhar) తెలిపిన వివరాల ప్రకారం.. పుల్లూరు గ్రామ సమీపంలోని వైకుంఠధామంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు తన ఇబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. అక్కడ పేకాడుతున్న ఏడుగురు వ్యక్తులను వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.14,580 నగదు, 6 సెల్‌ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అందులో ఐదుగురు పుల్లూరు గ్రామానికి చెందినవారు కాగా మరో ఇద్దరు కర్నూలు పట్టణానికి చెందిన వారిని ఎస్ఐ తెలిపారు.