09-08-2025 11:34:14 PM
మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) నివాస ప్రాంగణంలో శని వారం క్విట్ ఇండియా దినోత్సవం సందర్బంగా ఉద్యమ జెండాను పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతితో కలిసి ఆయన మాట్లాడారు. 1942, ఆగస్టు 8న బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు . క్విట్ ఇండియా ఉద్యమానికి మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, జవహర్లాల్ నెహ్రూలు నాయకత్వం వహించారన్నారు.
స్వతంత్ర పోరాటంలో ఆఖరి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమమని, దాంతోనే మన దేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారత దేశం కూడా బ్రిటన్ కి సహాయం చేస్తుందని బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. నాడు బ్రిటిష్ పాలన ఏ విదంగా కొనసాగిందో అదే దిశగా నేడు భారత దేశంలో బీజేపీ పాలన కొనసాగిస్తుందన్నారు. దేశంలోని వనరులను బ్రిటిష్ వారు దోచుకొని వెళ్ళిపోతే, రాజ్యాంగ హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ మత విద్వేషాలు సృష్టించి దేశంలో అశాంతిని నేలకొల్పి తద్వారా మరోసారి అధికారంలోకి రావాలని మోడీ ఆలోచిస్తున్నారు. 2029 ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు. ఓట్ చోరి నినాదంతో రాహుల్ గాంధీ ఉద్యమాన్ని చేయాలన్నారు.
రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు అండగా ఉన్నామన్నారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ ఛైర్మెన్ సురిమిళ్ళ వేణు, మంచిర్యాల మాజీ వైస్ ఛైర్మెన్ సల్ల మహేష్, లక్షెట్టిపేట టౌన్ అధ్యక్షులు ఆరిఫ్, నాయకులు రామగిరి బాణేష్, పుస్కూరి శ్రీనివాస్ రావు, ఖలీద్, ఒడ్డె రాజమౌళి, మోటపలుకుల గురువయ్య, సంజయ్ రావు, కిషన్, మల్లయ్య, నరిగె నరేష్, వెంకటేష్, తాజుద్దీన్, సాయి, రమేష్ నాయక్, జక్కుల కుమార్, రాజన్న, మల్లేష్, సత్యనారాయణ, కిష్టయ్య, తిరుపతి, శంకర్ రావు, మంచిర్యాల నియోజక వర్గ మాజీ ప్రజా ప్రతినిదులు, యువజన, బీసీ, ఎస్సి, మైనార్టీ, ఎన్ ఎస్ యూ ఐ, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.