09-08-2025 11:26:26 PM
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ ఆదివాసి దినోత్సవం
గిరిజన సంప్రదాయ నృత్యాలతో అలరించిన గిరిజనులు
చర్ల (విజయక్రాంతి): చర్ల మండల వ్యాప్తంగా సిపిఐ సిపిఎం, ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో జట ఆవిష్కరణ గావించి ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించారు, ఆదివాసీ సంప్రదాయం మూర్తి పడేలా కొమ్ము డాన్సులు డోలు వాయిద్యాలతో గిరిజనులు నిత్య ప్రదర్శనలు చేశారు, ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చర్ల మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్(District SP Rohit Raj) ఆదేశానుసారం ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఓఎస్డి, జిల్లా ఓఎస్డి నరేందర్ ,భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఆదివాసీల జీవన స్థితిగతులు మెరుగుపరిచే విధంగా చట్టాలు రావాలని ఉన్న చట్టాలను వినియోగించుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు,
ఓ ఎస్ డి నరేందర్ ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఆదివాసులు విద్యపై శ్రద్ధ పెట్టి మంచిగా చదువుకొని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పడం జరిగినది. అనంతరం మండల సిఐ రాజు వర్మ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మంచి లక్షణాలు అలవర్చుకోవాలని ప్రతి ఒక్కరు భవిష్యత్ కోసం ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదివాసీలుగా ఉన్నత స్థాయిలో ఉన్నత ఉద్యోగాల కోసం అన్వేషణ సాధించాలని , వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పోలీసు వ్యవస్థ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా రాజు వర్మ మాట్లాడారు. , ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ వివేక్ రంజన్,ఎస్ఐ నర్సిరెడ్డి, ఎస్ఐ కేశవ్ ,చర్ల మండల ఆదివాసి జేఏసీ నాయకులు, రైస్ క్లబ్ చైర్మన్ ఇరప శ్రీనివాస్, ఇరప వసంత్, సత్యనారాయణ ,హిమగిరి ,పాపారావు,పాయం సత్యనారాయణ , కాపుల కృష్ణ అర్జున్ రావు, ఆదివాసీ సంఘల నాయకులు, చర్ల మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.