03-08-2025 07:49:34 PM
అర్వపల్లి: మేమెంతో మాకంత అనే నినాదంతో ఆదివారం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ కాసం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన వైశ్య రాజకీయ రణభేరి సభకు జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన ఆర్యవైశ్యులు ఆదివారం మండల కేంద్రం అర్వపల్లి నుండి ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు వైశ్య నాయకులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక,సామాజిక సేవ రంగంలో ముందుండి నడిపించే వైశ్యులు రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్నామని అన్నారు.రాజకీయ రణభేరి సభతో తమ సత్తా ఏమిటో ఇతర పార్టీలకు తెలిసే విధంగా తమ ఐక్యతను చాటుతామని అన్నారు.