03-08-2025 07:38:10 PM
జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం (కోట గుళ్ళు)లో గోశాల నిర్వహణకు భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు రూ.15 వేలు అందజేశారు.
కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయంలో శ్రావణమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.