calender_icon.png 3 August, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిర్జాదిగూడలో కాలనీల కమాన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

03-08-2025 07:42:27 PM

ఈ సందర్భంగా హరి శంకర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు

మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా వారి నివాసంలో జరిగిన వేడుకలలో మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి,  పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డితో కలిసి పాల్గొని వారిని గజమాల, శాలువాతో సత్కరించి కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు.  అనంతరం మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి సొంత నిధులతో నిర్మించిన విహారిక కాలనీ, సాయి నగర్ హిల్స్ కాలనీ, ఇంద్రప్రస్థ కాలనీల కమాన్లు ప్రారంభించారు.