29-10-2025 12:00:00 AM
మరో ఇద్దరు డాక్టర్లకు షో కాస్ నోటీసులు
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంత మంది సిబ్బంది విధులకు హాజరు అయ్యారని రిజిస్టర్ ను పరిశీలించారు. విధులకు గైర్హాజర్ అయిన ఆయుర్వేదిక్ డాక్టర్ సయ్యద్ నుస్రత్ ను సస్పెండ్ చేస్తూ మరో ఇద్దరు. డాక్టర్ రజనీకుమారి, డాక్టర్ వీరన్న లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు.
విధులకు హాజరు కాని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులను కలియ తిరిగారు, వార్డు లలో పరిశుభ్రంగా లేనందున శానిటేషన్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బంది ని కలెక్టర్ హెచ్చరించారు. వైద్యులు అందరూ రోజు విధులకు హాజరు కావాలని నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు.
ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు మంచిగా వైద్యం అందిస్తున్నారా, సిబ్బంది ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో వర్షం నీరు నిలువ ఉండడంతో నీరు బయటకు వెళ్లేలా మార్గం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.