29-09-2025 10:20:29 PM
బతుకమ్మ కేంద్రాల వద్ద ఎస్సై రాజేష్ పహారా..
రేగొండ (విజయక్రాంతి): మండల వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలంతా రంగురంగు పూలతో బతుకమ్మలను పేర్చుకొని ఆటపాటలతో నృత్యాలు చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలందరూ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో బతుకమ్మ కేంద్రాల వద్ద నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను ఆయా చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేసి సల్లంగా పోయి రావే బతుకమ్మ అంటూ వీడ్కోలు తెలిపారు. స్థానిక ఎస్సై రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బతుకమ్మ కేంద్రాల వద్ద ఎటువంటి అంతరాయాలు కలగకుండా శాంతిభద్రలు చేపట్టారు.