28-11-2025 12:19:42 AM
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 27 (విజయక్రాంతి):మంచిర్యాల జిలా జిల్లా చెన్నూరు బొప్పారం అటవీ ప్రాంతం అరుదైన శిలా సంపదకు ప్రసిద్ధి గాంచింది. రాక్షస బల్లులు, రాతి శిలాజాలు అటవీ ప్రాంతంలో అరుదైనవిగా ఘనతకెక్కాయి. అంతరించి పోతున్న శిలాజాల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు అర్కిటాలజిస్టులు, సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం అధికారుల బృందం పరిశోధన కోసం పర్యటించారు.
గురువారం చెన్నూరు బొప్పారం ఫారెస్ట్ లో పర్యటించి పాజిల్స్‌ను కనుగొన్నారు. వీటిని హైదరాబాద్ కేంద్రంగా మ్యూజియంలో ఈ శిలాజాల విశిష్టతను చాటి చెప్పనున్నారు. ప్రజల అవగాహన కోసం మ్యూజియంలో ఈ శిలాజాలను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజి యం శాఖ సంచాలకులు ప్రొఫెసర్ అర్జునరావు కుతాడి ఆదేశాల మేరకు హైదరా బాదు నుంచి సాంకేతిక బృందం, సింగరేణి ఎక్స్ ఫ్లోరేషన్ అధికారులు సంయుక్తంగా చెన్నూరు గోపారం అడవులు పర్యటించారు.
చెన్నూరు బొప్పారం ఫారెస్ట్ డివిజన్‌లోని,పాజిల్స్ కోసం విస్తృతంగా పరిశోధన జరిపారు. బొప్పారం అడవుల్లో వృక్ష, జంతు శిలాజాలకు సంబంధించిన పాజిల్స్ ను సేకరించారు.ఈ పాజిల్స్ 230 మిలియన్ సంవత్సరాల క్రితానికి చెందిందని పరిశోధకులు చెప్పారు. బొప్పారం అటవీ ప్రాంతంలో శిలాజాల నిక్షిప్త స్థలాన్ని గుర్తించడానికి అర్కిటాలజిస్ట్ లు, సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం నిపుణులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది.
ఈ పరిశోధనలో సేకరించిన పాజిల్స్ అన్నిటిని కూడా తెలంగాణ స్టేట్ మ్యూజియంలోని సందర్శికుల నిమిత్తం ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు. ఈ శిలాజాల.స్థల పరిశోధనలో పురావస్తు శాఖ ఉపసంచాలకులు డాక్టర్ పి.నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్, ఎన్. సాగర్ అసిస్టెంట్ డైరెక్టర్, రామగుండం సింగరేణి జియాలజిస్ట్, డీవైజీయం హనుమంత్, చైయిన్ మెన్ దేవేందర్ పాల్గొన్నారు