16-10-2025 09:50:06 AM
హైదరాబాద్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో(Kondapuram) దారుణం చోటుచేసుకుంది. అన్న రమేశ్ పై తమ్ముడు మేరుగుర్తి సురేశ్ కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన వదినపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. అన్న రమేశ్ కు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు(Warangal MGM) తరలించారు. అన్నదమ్ముల మధ్య ఘర్షణ ఆస్తుల వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.