29-10-2025 01:34:51 AM
-రాష్ర్టవ్యాప్తంగా దీక్షలు, ధర్నాలు చేపట్టాలి
-ఉద్యమాన్ని ఉధృతం చేయాలి
-రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, సిటీ బ్యూరో అక్టోబర్ 28 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా త్వరలోనే ‘బీసీ రథయాత్ర’ చేపడతామని ఆయన ప్రకటించారు. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలు బీసీ సంఘాల నాయకులు ఆయనతో సమావేశమై, ఉద్యమాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు రథయాత్ర నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
వారి మాటలపై తక్షణమే స్పందించిన కృష్ణయ్య యాత్ర కు హామీ ఇచ్చారు. ఇటీవల ఈనెల 18న నిర్వహించిన రాష్ర్ట బంద్ చారిత్రాత్మక విజ యం సాధించిందని, ఈ బంద్ ప్రభావంతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల్లో కదలిక వస్తుందని ఆర్. కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. బంద్ విజయం ప్రభుత్వాలను ఆలోచింపజేస్తుంది. వారు కచ్చితంగా స్పం దించి, రిజర్వేషన్ల పెంపునకు అవసరమైన రాజ్యాం గ సవరణ చేస్తారని నమ్ముతున్నాం అని ఆయన పేర్కొన్నారు.
రిజర్వేషన్ల సాధన కోసం రాష్ర్టంలోని అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో దీక్షలు, ధర్నాలు చేపట్టాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఇప్పటికే రాష్ర్టంలోని 150 పట్టణ కేంద్రాల్లో మన నాయ కులు, కార్యకర్తలు దీక్షలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ స్ఫూర్తిని ప్రతి గ్రామానికి, మండలానికి తీసుకెళ్లాలి. ఉద్యమాన్ని మరిం త ఉధృతం చేయడం ద్వారానే మన హక్కులను సాధించుకోగలం అని ఆయన పిలు పునిచ్చారు. ప్రభుత్వాలు దిగివచ్చి, బీసీలకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.