29-10-2025 01:33:23 AM
పార్టీ రాష్ట్ర నాయకులు
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): బీసీలను చట్టసభలకు తీసుకెళ్లేది బీఎస్పీనే అని పార్టీ రాష్ట్ర నాయకులు అన్నా రు. బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు లక్నోలో అక్టోబర్ 9న 15 లక్షల మందితో జరిగిన సభలో బీఎస్పీ నాయకురాలు కుమారి మాయావతి మాట్లాడిన వ్యాఖ్యలను వారు గుర్తు చేశారు. “రాబోయే రోజుల్లో మా పార్టీ ఏయే రాష్టా ల్లో అధికారంలోకి వస్తుందో ఆ రాష్ట్రాలలో అన్నిరంగాలలో జనాభా దమాషా ప్రకారం బీసీలకు వాటా ఇస్తామన్నారు.
బీసీలకు చట్టసభల్లో రావాల్సిన వాటాను కచ్చితంగా అమలు పరుస్తం అన్నారు. 1984కి ముందు బీసీలను ఏ పార్టీ కూడా చట్టసభల్లోకీ తీసుకొనిపోలేదు. మేనిఫెస్టోలు పెట్టకుండా రాజ్యాంగమే మేనిఫెస్టోగా పెట్టుకొని పరిపాలించే ఏకైక పార్టీ బీఎస్పీ. ప్రతి జాతికి భూమిని, అధికారాన్ని ఇచ్చి అభివృద్ధి చేస్తూ అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తు పరిపాలించిన పార్టీ బీఎస్పీ” అని మాయావతి అన్నారని చెప్పారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అతర్ సింగ్ రావు మాజీ ఎమ్మెల్సీ, సెంట్రల్ కోఆర్డినేటర్, ఆర్య మాజీ జడ్పీ చైర్మన్, సెంట్రల్ కోఆర్డినేటర్, కోఆర్డినేటర్లు బాలయ్య, దయానంద్‌రావు, నిశాని రాంచంద్రం, ఇబ్రామ్ శేఖర్ (మాజీ డిప్యూటీ మేయర్) స్టేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ శ్రీరాం కృష్ణ, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ముదిరాజ్, ఈశ్వర్, ప్రభుకుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు