calender_icon.png 7 September, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడులకు రేటింగ్..!

04-09-2025 12:04:38 AM

-  ‘స్వచ్ఛ ఏవమ్ హరిత్’ కింద పాఠశాలల ఎంపిక

- ఈనెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

- జాతీయస్థాయిలో ఎంపికైతే రూ.లక్ష ప్రోత్సాహకం

మెదక్, సెప్టెంబర్ 3(విజయక్రాంతి): పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, మరుగు దొడ్ల నిర్వహణకు సంబంధించి దేశ వ్యాప్తం గా బడులకు రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్ర భుత్వం ’స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో నిర్వహణకు సంబంధించి ఆన్లైన్లో ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉం టుంది.

దేశవ్యాప్తంగా 20 పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ.లక్ష నగ దు ప్రోత్సాహకంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులను మూడు రోజుల పాటు దేశవ్యా ప్తంగా ఉన్న విహార కేంద్రాల సందర్శనకు తీసుకెళ్లనున్నారు. అయితే ప్రభుత్వం ఇదివరకు స్వచ్ఛత పురస్కారాలు అందజేసిన విషయం తెలిసిందే, ఆ కార్యక్రమం నిలిచిపోగా మళ్లీ జాతీయ స్థాయిలో పాఠశాలలకు రేటింగ్ పేరుతో పురస్కారాలు ఆం దించనుంది.

కార్యక్రమం ఇలా...

మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ తదితర పాఠశాలలు 1,050 వరకు ఉన్నా యి. సుమారు 1,20,000 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూళ్ల యాజమాన్యాలు స్వచ్చ ఏవమ్ హరిత్ స్కూల్ రేటింగ్ కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది. పాఠశాలల్లోని తాగునీరు, మరుగు దొడ్లు, మూత్రశాలల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత తదితర పాఠశాల నిర్వహణపై ఆన్లైన్లో ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

అక్టోబర్ లో కమిటీ బృందం తనిఖీ చేపడు తుంది. 3-స్టార్ వచ్చిన పాఠశాలలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన ఆరు పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 4 స్టార్ వచ్చిన వాటిని జాతీ య స్థాయికి ఎంపిక చేస్తారు. దేశంలోని ఉత్తమంగా ఉన్న 200 పాఠశాలలకు స్వచ్చ ఏవ మ్ హరిత్ పురస్కారం అందజేస్తారు. రూ.ల క్ష నగదుతో పాటు ఉపాధ్యాయులను విహార యాత్రకు తీసుకెళ్తారు. అయితే 35 నుంచి 50 పాయింట్లు ఉన్న పాఠశాలలకు 2-స్టార్, 51 నుంచి 74 పాయింట్లు గల పాఠశాలలకు 3-స్టార్, 75 నుంచి 89 పాయింట్లు ఉన్న స్కూళ్లకు 4-స్టార్, 90 నుంచి 100 పాయింట్లు ఉన్న బడులకు 5- స్టార్ కేటాయిస్తారు. 

బాగుపడనున్న స్కూళ్లు..

స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారంతో సర్కారు పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొననుంది. మరుగుదొడ్ల నిర్వహ ణ బాగుపడనుంది. ఆయా బడుల్లో స్వచ్చ వాతావరణం నెలకొల్పడానికి దోహద పడుతుం ది. అయితే ప్రస్తుతం చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నిర్వహ ణ అస్తవ్యస్తంగా ఉంది. నీటి సదుపాయం ఉన్నప్పటికీ వాటిని వినియోగించడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పాఠశాలల ఆవ రణలో మొక్కలు నాటడం, పరిసరాల శుభ్రత, పచ్చదనం కోసం దోహదపడనుం ది. జాతీయ స్థాయిలో ఎంపికైతే జిల్లాతో పాటు పాఠశాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

30 వరకు దరఖాస్తుకు గడువు..

’స్వచ్ఛ ఏవమ్ హరిత్ స్కూల్ రేటింగ్’ కింద పాఠశాలలను జాతీయస్థాయిలో ఎంపిక చేస్తారు. ఈనెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంఈవోలు, మండలానికి ఒక ఉపాధ్యా యుడు చొప్పున మంగళవారం శిక్షణ కల్పిం చాం. జాతీయ స్థాయిలో ఎంపికైన పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహం అందజే స్తారు. అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

డాక్టర్ రాధాకిషన్, డీఈవో,మెదక్