calender_icon.png 31 July, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలందరికీ రేషన్ కార్డులు

30-07-2025 01:03:56 AM

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడి

నిర్మల్, జూలై ౨౯ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని అర్హులైన పేద లందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులను అందిస్తుందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మాముడా లక్ష్మణ్ చందా మండల కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. లక్ష్మణ్ చందా మండలంలో 613 మామడ మండలంలో 655 కొత్త రేషన్ కార్డులు మంజూ రైనట్టు ఎమ్మెల్యే తెలిపారు.

ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి అవసరం ఉందని,  ఇంకా రేషన్ కార్డు లేని ప్రతి ఒక్క రూ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష్ అభినవ్, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నా కళ్యాణి, ఎమ్మార్వో, ఎంపీడీవో, నాయకులు రావుల రాంనాథ్ , మండల అధ్యక్షులు చిన్నయ్య, నాయకులు అడ్వాల రమేష్, జీవన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఓస రాజు, సురేష్, రాజేశ్వర్, పోషెట్టి, రవి, చంద్రమోహన్ రెడ్డి, రాజు కుమార్, గంగాధర్, ప్రవీణ్, వడ్డే శ్రీను, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.