30-07-2025 01:04:31 AM
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా, ఆంధ్రా ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందే అని మాజీసీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయం గా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమన్నారు.
రాష్ట్రంలో రైతాంగ సంక్షేమం కాపాడటం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ ప్రజ ల ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి పార్టీ ముఖ్య నేతలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ సంద ర్భంగా కేసీఆర్ నేతలకు పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలకు అండగా నిలబడేది బీఆర్‌ఎస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్‌ను నమ్మిన పాపానికి, తెలంగాణ రైతాంగానికి శాశ్వత అ న్యాయానికి ఒడిగడుతోందని, కాంగ్రెస్ ప్ర భుత్వ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ర్ట సీఎం తహతహ లాడుతుం డడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వ కంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు అయిపోతున్నా రైతాంగానికి సాగునీరు అందిం చని రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని సూచించారు. కన్నె పల్లి పంప్‌హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలని, పంపులను ఆన్ చేయాలని, చెరువులు కుంటలు రిజర్వాయర్లను నింపాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు.
రాష్ర్టంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో రాష్ర్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని, దీని మీద పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ రాష్ర్ట ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారని, దీనిమీద పార్టీ గట్టిగా రెండు పార్టీలను నిలదీయాలని సూచించారు.
ఇప్పటికే ప్రజాసమస్యల మీద పోరాడేందుకు బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్న దిశగా, మిగతా అన్ని అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేసి వాళ్లను క్షేత్రస్థాయిలో పోరాటంలో ప్రజలతో మమేకం చేయాలన్నారు. అందుకు బీఆర్‌ఎస్ శ్రేణులను క్షేత్రస్థాయిలో పోరాటాల కోసం కార్యో న్ముఖులను చేయాలని అధినేత కేసీఆర్ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు