calender_icon.png 7 September, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు రేషన్ బంద్!

04-09-2025 12:00:00 AM

  1. ప్రభుత్వం నుంచి డీలర్లకు భారీగా బకాయిలు 
  2. రూ.10 కోట్లకు పైగానే కమిషన్ పెండింగ్
  3. కాంగ్రెస్ హామీ నెరవేర్చాలని డిమాండ్
  4. పంపిణీ బంద్‌కు డీలర్లసంఘం పిలుపు

కరీంనగర్, సెప్టెంబర్03)విజయక్రాంతి): రేషన్ డీలర్లు తమ సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. ఈ నెల 5 న రేషన్‌సరకుల పంపిణీ నిలిపివేసి బంద్ పాటించాల ని నిర్ణయించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనైనా సమస్యలు పరిష్కారం అ వుతాయని ఆశలు పెట్టుకున్న డీలర్లకు నిరాశే ఎదురైంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది.

ఏడాదిన్నర గడిచినా కూడా ఏ సమస్య పరిష్కరించలేదని, నెల వారీగా ఇవ్వాల్సిన కమీషన్ సొమ్మును కూడా సకాలంలో ఇవ్వడం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు .ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డీలర్లకు రూ:10 కోట్ల పై నే కమిషన్ రావలసి ఉంది. ఒక్కకరీంనగర్ జిల్లాలోనే 566 రేషన్ షాపులు ఉండగా, మొత్తం రేషన్ కార్డులు 2, 90,201 ఉన్నాయి. బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కమీషన్లు ఇస్తున్నది.

జిల్లబడెలర్ల కు 3.9 కోట్ల రూపాయల బకాయిలు రావలసి ఉంది.రేషన్ డీలర్లు నెలనెలా పంపిణీ చే సే బియ్యంపై ఇవ్వాల్సిన కమీషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ఇవ్వడం లేద ని డీలర్లు వాపోతున్నారు. కిలో బియ్యం పం పిణీ చేస్తే రూపాయి 40 పైసలు ఇవ్వాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 90 పైసలు, కేం ద్ర ప్రభుత్వం 50 పైసలు ఇస్తుంది.

ఏప్రిల్ నుంచి ఈ నెల వరకు ఐదు మాసాల కమీషన్ కేంద్ర ప్రభుత్వం, జూన్ నుంచి ఈ నెల వరకు మూడు మాసాల కమీషన్ రాష్ట్ర ప్ర భుత్వం ఇవ్వాల్సి ఉందని డీలర్లు చెబుతున్నా రు. ప్రభుత్వం ఇచ్చే కమీషన్లపైనే డీలర్లు ఆ ధారపడి జీవిస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి మూడు నెలల రే షన్ బియ్యం ఒకేసారి జూన్ మాసంలో ఇ చ్చారు.

రేషన్ సరుకులను సరఫరా చేసేందు కు డీలర్లు అద్దె భవనాలను కిరాయికి తీసుకుని అద్దె చెల్లించడంతో పాటు కరెంట్ బిల్లు లు చెల్లిస్తున్నారు. నెలలో 15 రోజులపాటు మాత్రమే బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ, బియ్యం సరఫరాలో జాప్యం జరిగి నప్పుడు 20వ తేదీ వరకు కూడా బియ్యం వినియోగదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సకాలంలో కమీషన్లు ఇవ్వక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.

రేపు బంద్  

బకాయిలతో పాటు న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 5 నబంద్ పాటిస్తున్నాము.కమీషన్ కాకుండా నెలకు 30 వేల రూపాయల గౌరవ వేత నం ఇవ్వాలని దశాబ్దకాలానికి పైగా పోరాడుతున్నాము. కేరళ, తమిళనాడు రా ష్ట్రాల్లో గౌరవ వేతనం ఇస్తున్నందున తె లంగాణలోనూ గౌరవ వేతనం ఇవ్వాలని కొరుతున్నాము. హెల్త్ కార్డు లతో పాటు 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించా లి. రేషన్ షాప్ అద్దె, కరెంట్ బిల్లు , డీలరు మరణిస్తే ఆ కుటుంబంలో వారసుడికి డీలర్షిప్ ఇ వ్వాలి. ఇప్పటికైనా మా మొర ఆలకించి హామీలను నెరవేర్చాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

రోడ్డ శ్రీనిబాస్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు