04-09-2025 12:00:00 AM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కాగజ్‌నగర్/బైంసా, సెప్టెంబర్ 3(విజయక్రాంతి): జిల్లాలో గణేష్ నిమజ్జనోత్స వాలను శాంతి భద్రతల మధ్య సాఫీగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపా రు. బుధవారం కాగజ్‌నగర్‌లోని నిమజ్జన ప్రదేశమైన పెద్దవాగును సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల,ఏఎస్పి చిత్తరంజన్ తో కలిసి పరిశీలించి, సంబంధిత అధికారులకు, పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ శోభాయాత్ర జరిగే మార్గాల్లో ఎలాంటి ఆటంకా లు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాల ని, నిమర్జన ప్రాంతం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిమర్జన ప్రాంతం వద్ద వినాయక ప్రతిమల నిమర్జనాల కోసం క్రేన్లు, లైట్ల ఏర్పాటు, నిమజ్జన ఘాట్ల వద్ద ఈతగాళ్లతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
జిల్లా ప్రజలందరూ నిబంధనలు పాటిస్తూ, పోలీసులు ఇచ్చే సూచనలకు సహకరించి గణేష్ నిమజ్జనోత్సవాలను విజయవంతంగా జరగడానికి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్, రూరల్ సిఐ కుమారస్వామి, టౌన్ సిఐ ప్రేమ్‌కుమార్, డి.వై.ఈ.ఈ రమాదేవి, రూర ల్ ఎస్సై సందీప్ కుమార్ పాల్గొన్నారు.
నమ్మకం కలిగించేందుకే కవాతు
గణేష్ నిమజ్జనం వేడుకల నేపథ్యంలో ఎఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రధా న వీధుల్లో బుధవారం కవాతు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ.. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కల్పిస్తారని ప్రజలకు భరో సా కల్పించడానికి కవాతు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐలు, ఎసైలు సిబ్బంది పాల్గొన్నారు.
బైంసాలో నేడు గణేశ నిమజ్జనం
నిర్మల్ జిల్లా బైంసాలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం ఘనం గా నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉత్సవ సమితి నాయకులు అధికారులు గణేష్ నగర్ లోని మున్నూరు కాపు సంఘం భవనంలో వినాయకుడికి పూజలు చేసి నిమజ్జన కార్యక్రమం ప్రారంభించనున్నారు. భారీశోభాయాత్ర అనంతరం పట్టణ సమీపంలోని గడ్డన్న జలాశయంలో నిమజ్జనం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ముం దు జాగ్రత్తగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఇద్దరు డీ ఎస్పీలు, 28 మంది సీఐలు, 32 మంది ఎస్‌ఐలు ఇతరత్రా 650 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని పట్టణ సీఐ గోపీనాథ్ తెలిపారు.