26 March, 2026 | 12:23 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి

17-06-2025 10:43 PM

మునగాల: ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు డివైడర్ ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని ఆకుపాముల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) తెలిపిన వివరాల ప్రకారం... కొమరబండ గ్రామానికి చెందిన షేక్ ఇమామ్(20) అనే యువకుడు తన స్నేహితుడి బైక్ తీసుకొని దానిపై తన గ్రామం నుండి వరంగల్ కు బయలుదేరాడన్నారు. ఈ క్రమంలో ఆకుపాముల గ్రామ శివారులో గల మాంటిసోరి ప్రైమ్ స్కూల్ వద్దకు రాగానే అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిందన్నారు. దీంతో తీవ్రగాయాలైన ఇమామ్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఇదే విషయమై మృతుడి తండ్రి బడేసాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.