02-10-2025 01:51:33 AM
ముంబై : భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోత.. అంతర్జాతీ య పరిణామాల నేపథ్యంలో విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేటును మరోసారి యథాతథంగా ఉంచింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో 0.25శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ.. జూన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిక్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. మూడు వరుస సమీక్షల్లో కలిపి రేపోరేట్ 1శాతం తగ్గింది. ఆగస్టులో మాత్రం యథాతథంగా 5.5శాతం వద్దే ఉంచింది.