calender_icon.png 11 May, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదో విజయం సాధించిన బెంగళూరు

20-04-2025 07:25:44 PM

పంజాబ్: ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా ఆదివారం ముల్లన్‌పూర్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(73) తన బ్యాటింగ్ తో అలరించాడు. బెంగళూరు బ్యాటర్లలో దేవ్ దత్ పడిక్కల్(61), ఫిల్ సాల్ట్(1), రజత్ పటీదార్(12), జితేశ్ శర్మ(11) సిక్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లో అర్ష్ దీప్ సింగ్, హర్పీత్ బ్రార్, చాహల్ చెరో వికెట్ తీశారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రన్ సింగ్(33), శశాంక్ సింగ్(31), జోస్ ఇంగ్లిస్(29), మార్కూ యాన్సెన్(25), ప్రియాంశ్ ఆర్య(22), శ్రేయస్ అయ్యర్(6) పరుగులతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య 2, సుయాశ్ శర్మ 2, షెపర్డ్ 1 వికెట్ తీశారు.