1 July, 2026 | 12:54 AM

విద్యుత్ శాఖ కార్యాలయంలో విగ్రహాల పున ప్రతిష్ఠ

01-07-2026 12:11 AM

ఖమ్మం టౌన్, జూన్ 30 (విజయక్రాంతి): విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో జాతిపిత మహాత్మ గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ల విగ్రహాల పున ప్రతిష్ట కార్యక్రమం విద్యుత్ శాఖ డైరెక్టర్ ప్రొడకట్స్ వంగూరు మోహన్ రావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించడం జరిగినది.

గత 18 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయ బడిన పాత  విగ్రహాలు చూడడానికి రంగు కోల్పోయి అందవిహీనంగా ఉన్న కారణంగా తోటి యూనియన్, వెల్ఫేర్ అసోసియేషన్, ఇంజనీర్స్, అకౌంట్ స్టాప్ అధికారుల అందరు సహకారముతో ఈ పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగినదని శ్రీనివాస చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్ నాయకులు, అసోసియేన్ నాయకులు, యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తోటి ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు బాబురావు, నాగేశ్వరరావు, బద్రుపవార్, రాములు ,రామారావు, శ్రీనివాసరావు , టి.వెంకటేశ్వర్లు,  వెంకటేశ్వర్లు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.