16-05-2025 12:11:49 AM
వెంచర్ ఏర్పాటుకు డాక్టర్ సాంబిరెడ్డి భూమి పూజ
గుంటూరు, మే 15: ఆంధ్రప్రదేశ్‌లో కూట మి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు శ్రీ కారం చుట్టింది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ప్రతిరోజు ఎక్కడ చూసినా భూమి పూజతో వెంచర్లు శరవేగంగా ఏర్పాటు అవుతున్నాయి.
సీఆర్డీఏ అనుమతులతో అమరా వతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలు వాటి నిర్మాణ పనులను ప్రారంభించాయి. ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్డు ఉన్న అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కనిపిస్తుంది. అందులో భాగంగా డాక్టర్ ఆళ్ళ సాంబిరెడ్డి గురువారం వెంచర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
మురుగునీటి కాలువలు నిర్మించడం, తాగునీటి సౌక ర్యాలు కల్పించడం వంటి వాటిలో ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించడం ద్వారా గత ఆరు నెలల్లో విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతంలో భూమూల విలువ మూడు రెట్లు పెరిగాయి. మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్ త్రి పనులు వేగంగా జరుగుతుండటంతో పలకలూరు పరిధిలో అపార్ట్‌మెంట్లు, విద్యాలయాలు, భవనాలు వెలిశాయి.
ఆర్టీవో ఆఫీస్ నుంచి పలకలూరు వరకు గంట ప్రయాణం గతంలో ఉండేది. ప్రస్తుతం 80 అడుగుల రోడ్లతో అభివృద్ధి చేయడం ద్వారా ఆర్డీవో ఆఫీస్ నుంచి ఐదు నిమిషాల్లోనే పలకలూరు చేరుకోవచ్చు. ఇలాంటి అభివృద్ధి ద్వారా ఏడాదిలోపే కొన్న భూమికి రేట్లు పెరుగుతాయని రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.