calender_icon.png 16 May, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకే!

16-05-2025 01:16:35 AM

  1. కంచ గచ్చిబౌలి చెట్ల తొలగింపునకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? 
  2. లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు తొలగింపు పనులు చేపట్టారు..? 
  3. జూలై 23 కల్లా పర్యావరణ పునరుద్ధరణ చర్యలు 
  4. చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశం 
  5. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా

న్యూఢిల్లీ, మే 15: కంచ గచ్చిబౌలి చెట్ల తొలగింపు ద్వారా జరిగిన పర్యావరణ నష్టం పూడ్చకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సి ఉం టుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహా రంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భం గా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల తొల గింపు కోసం పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? లేదా స్పష్టం చేయాలని కోర్టు ఆదేశించింది.

లాంగ్ వీకెండ్ చూసి ఎందుకు చెట్ల తొలగింపు పనులు చేపట్టారని మరోసారి ప్రశ్నించింది. నష్టాన్ని పూడ్చేందుకు తీసుకునే చర్యలు స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. కేంద్ర సాధికార సంస్థ నివేదికపై కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. కాగా, జూలై 23 కల్లా ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. 

పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చే చర్యలు చేపట్టకపోతే సీఎస్ సహ కార్యదర్శులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈసందర్భంగా విజిల్ బోయర్స్, విద్యార్థులపై కేసుల విషయా న్ని పలువురు న్యాయవాదులు కోర్టు దృష్టి కి తీసుకెళ్లారు.

ఆ కేసులు కొట్టివేయాలని అప్లికేషన్ దాఖలు చేసినట్లు తెలపగా.. ఈ పిటిషన్‌తో కలిపి విచారించడం కుదరదని సీజేఐ స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను జూలై 23కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలిలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.