calender_icon.png 16 May, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరేండ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

16-05-2025 12:07:30 AM

ఆహార పదార్థాల ధరలు తగ్గడమే కారణం

న్యూఢిల్లీ, మే 15: ఇండియాలో రిటైట్ ద్రవ్యోల్బణం ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. గత నెలలో 3.16గా నమోదైంది. ఆహారపదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 2019 జూలై నుంచి ఇంత తక్కువ మోతాదులో రిటైల్ ద్రవ్యోల్బణం ఏనాడు కూడా నమోదు కాలేదు. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 1.78 శాతం మేర నమోదైంది.

2021 అక్టోబర్ నుంచి ఏనాడూ ఇంత తక్కువగా నమోదు కాలేదు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతోనే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్బీఐ అంచనా వేసిన 4 శాతం కంటే తక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడో నెల కావడం గమనార్హం. ద్రవ్యోల్బణ తగ్గింపు పాలసీ మేకర్లు ఇతరులకు భారీ ఉపశమనాన్ని అందించింది. కూరగాయల ధరలు తగ్గడం కూడా ఈ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గేందుకు ఒక కారణంగా తెలుస్తోంది.