17-11-2025 12:36:17 AM
-మున్సిపల్ ఎన్నికల్లో ఓటు చోరీకి కుట్ర
- మాజీమంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల అర్బన్, నవంబర్ 16 (విజయ క్రాంతి): జగిత్యాల అర్బన్ డబుల్ బెడ్ రూమ్ పథకం కొంతమందికి రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎం గా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఆదివారం జగిత్యాలలో ఏర్పాటుచేసిన విలేకరుల స మావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉ మ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో జగిత్యాలలో ప్రత్యేకంగా ఇల్లు లేని నిరుపేద వర్గాలందరికీ ఇల్లు కల్పించాలనే సం కల్పంతో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా నూకపల్లి లో అందుబా టులో ఉన్న ప్రభుత్వ భూమి తో పాటు 100 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములు సేకరించి 4000 మందిని గుర్తించి, లే ఔట్ తో ఇండ్లు మంజూరు చేశారన్నారు.
ఇళ్ల నిర్మా ణం వివిధ దశల్లో ఉండగా, యధావిధిగా నిర్మాణం పూర్తి చేసి ఉంటే 4000 మంది సొంత ఇంటి యజమానులు అయ్యేవారని,కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని అప్పటి టిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం తెర పైకి తీసుకు వచ్చిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఇందిరమ్మ లబ్ధదారులకు కాకుండా 3500 మంది లబ్ధిదారులను గుర్తించి ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా ఇండ్లు కేటాయించారన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటు అనంతరం మౌలిక వసతులు త్రాగునీరు కు రూ.14.5 కోట్లు, రోడ్డు, విద్యుత్, సౌకర్యాల కోసం రూ.18 కోట్లు కేటాయించినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. మౌలిక వసతుల కల్పన అనంతరం కూడా లబ్ధిదారులు ఇళ్లలో చేరలేదన్నారు. లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించి రెండు సంవత్స రాలు గడుస్తున్నా వారు ఇండ్లలో చేరకపోవడానికి కారణం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాణ్యతలో లోపాలు ఉన్నాయా.. లేక ఇండ్లు మంజూరైన వ్యక్తులు నిజమైన లబ్ధిదారులు కారా... అని జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
3500 లబ్ధిదారులు అంటే సుమా రు 10 వేల ఓటర్లు ఉంటారని, పట్టణంలోనిఒక్కో వార్డులో సుమారు 200 వరకు నూకపల్లి డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారన్నారు. వీరంతా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదా రుల ఓట్లను జగిత్యాల మున్సిపాలిటీ నుండి తొలగించి, వారందరినీ నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ లకు పంపించి జగిత్యాల మున్సిపాలిటీలో ఓటు చోరీ ని అరికట్టాల్సిన బాధ్యత అధికారుల పై ఉందన్నారు.
నూక పెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రెండు వార్డులను కూడా అదనంగా పెంచిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. నిర్మాణం పూర్తయిన మిగిలిన ఇండ్లను, అదేవిధంగా లబ్ధిదారులు నివాసం ఉండని ఇండ్లను అధికారులు స్వాధీనం చేసుకొని పట్టణంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి కేటాయించాలని జీవన్ రెడ్డి కోరారు.
ఎస్‌ఆర్‌ఎస్పి భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని, చెరువులు, కుంటలకు బఫర్ జోన్ హద్దులు ఏర్పాటు చేయాలని,ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను కోరారు.