19-11-2025 12:00:00 AM
నేపాల్‌లో రాజకీయ నాయకుల అవినీతిపై మొదలైన జెన్ జెడ్ ఉద్యమం ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తోంది. తాజాగా దేశం లో నానాటికీ పెరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో వేలాది మంది జెన్- జడ్ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారా యి. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ రాజీనామా చేయాలని వేలాది మంది యువత ఆగ్రహంతో ఊగిపోయారు.
ఈ క్రమంలోనే అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 120 మంది గాయపడ్డారు. మెక్సికోలో జెన్ జడ్ తరహా ఉద్యమం వెనుక కారణాలు అనేకం. ఈ నెల ఒకటో తేదీన మెక్సికో పశ్చిమ రాష్ర్టమైన మిచోకా న్‌లోని ఉరుపాన్ నగర మేయర్.. కార్లోస్ మాంజో రోడ్రిగ్జ్ దారుణ హత్య కు గురయ్యారు. మాదకద్రవ్యాల ముఠా అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయన్ను ‘డే ఆఫ్ ది డెడ్’ అనే బహిరంగ కార్యక్రమంలో దుండ గులు కాల్చి చంపారు.
మాంజో హత్య దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. దేశానికి ప్రమాదకరంగా మారుతున్న మాదక ద్రవ్యాల ముఠాకు వ్యతిరేకంగా మాంజో తన పోరాటాలు కొనసాగించారు. మాంజో హత్యతో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా నాశన మయ్యిందని, మాదక ద్రవ్యాల ముఠా చేతుల్లోకి దేశం వెళ్లిపోతుందంటూ యువత సహా వృద్ధులు కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. గతేడాది అక్టోబర్‌లో షీన్‌బామ్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 70 శాతానికి పైగా ప్రజాదరణను సొంతం చేసుకున్నారు.
అమెరికా విధానాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలోనూ, వెనిజులాకు మద్దతు ఇవ్వడంలోనూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై బహిరంగ విమర్శలు చేయడంలోనూ షీన్‌బామ్ తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే మాంజో తన ను హత్య చేయడానికి కొన్ని నెలల ముందు మాదకద్రవ్యాల ముఠాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై పోరాటం చేయడానికి సహాయమందించాలని షీన్‌బామ్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది జూన్‌లో టకాంబరో మేయర్ సాల్వడార్ బాస్టిడాస్ సహా అతని అంగరక్షకుడిని మాదకద్రవ్యాల ముఠా దుండగులు హత్య చేశారు. తనకు ప్రాణభయం పొంచి ఉందని మాంజో పేర్కొన్నప్పటికీ క్లాడియా మాత్రం అతడి విజ్ఞప్తిని పట్టించుకోలేదు.
మాంజో హత్య తర్వాత క్లాడియా అనుసరించిన దేశ భద్రతా విధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే 1980ల నాటి నుంచే మెక్సికోలో ఈ తరహా నిరసనలు జరుగుతూ వస్తున్నాయి. థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సీఎఫ్‌ఆర్) నివేదిక ప్రకారం మెక్సికో ప్రస్తుతం కిడ్నాప్‌లు, నేరపూరిత హింస సంక్షోభాన్ని ఎ దుర్కొంటోందని, దీని వల్ల 2018 నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 30 వేల మందికి పైగా మరణించారని పేర్కొంది. హత్యల్లో ఎక్కువభాగం మా దకద్రవ్యాల ముఠాలు, రౌడీ గ్యాంగ్‌లే ప్రధాన పాత్ర పోషించాయని సీఎఫ్‌ఆర్ వెల్లడించింది. శాంతియుతంగా మొదలైన జెన్ జెడ్ ఉద్యమం హిం సకు దారి తీయడంతో నేపాల్ తరహాలో క్లాడియా కూడా తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో చూడాలి!