calender_icon.png 24 November, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇష్టారాజ్యంగా ప్రైవేట్ జూనియర్ కాలేజీల నిర్వహణ

24-11-2025 12:38:27 AM

- లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న వైనం

- ఐఐటి, మెడికల్ అకాడమీల పేర్లతో దోపిడి

- మచ్చుకైన కనబడని ల్యాబులు

- అనుమతులు లేకుండానే అకాడమీ ల నిర్వహణ

- మత్తు నిద్రలో సంబంధిత అధికారులు

ఖమ్మం, నవంబరు 23 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీల నిర్వహణ జరుగుతోంది. లక్షల్లో ఫీజులను వసూళ్లు చేస్తూ పేద,మధ్యతరగతి ప్రజానీకాన్ని దోచుకుంటున్నాయి. కాలేజీల నిర్వహణ పేరుతో వి ద్యార్థులకు తల్లిదండ్రులకు టోకరా వేస్తు తమ కాలేజీల్లో ఉన్నతమైన చదువుల అందిస్తామని మాయమాటలు చెప్తు అందిన కాడి కి దండుకుంటున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కాలేజీ నిర్వహణ జరపాలంటే ప్రతి కాలేజీలో ప్లే గ్రౌండ్, ల్యాబ్, అర్హత కలిగిన ఉపాధ్యాయులు,  పీ ఈటి, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన నిబంధనలు పాటించాల్సిన అవస రం ఉంటుంది. కానీ ఇవేమీ పట్టనట్లుగా కాలేజ్ నిర్వాహకులు వ్యవహరించడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే ప్రైవేట్ కళాశాలలో క్వాలిటీ విద్య పేరుతో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం జగమెరిగిన సత్యం. దీనికి తోడు ఏ కాలేజీ కూడా నిబంధనల ప్రకారం నడుపుతున్న దాఖలాలు లేవు. సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తులో తూగడం వల్ల కళాశాలల యజమానులు చేసే చేష్టలకు అడ్డు అదుపు లేకుండాపోతోందన్న విమర్శలు ఉన్నాయి.

ఐఐటి, మెడికల్ అకాడమీ ల పేర్లతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశచూపి నిబంధనలకు విరు ద్ధంగా కాలేజీలు నడపుతునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం నగరంలో నడుపుతున్న ప్రైవేట్ అకాడమీ సెంటర్లకు వేటికి కూడా అనుమతులు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కోచింగ్ సెంటర్లకు పలు కాలేజీల విద్యార్థులకు కోచింగులు ఇప్పించి అవి తమ కాలేజీల పేరిట వచ్చిన ర్యాంకులుగా చెప్పుకుంటున్నట్లు విమర్శలు లేకపోలేదు.

ఏ కాలేజీలో కూడా అనుభవం ఉన్న ఉపాధ్యాయుల కంటే అనుభవం లేనివారే ఎక్కువగా కనిపిస్తారు. వీరి ద్వారా కాలేజీ లా నిర్వహణ చేస్తూ క్వాలిటీ విద్యా అందిస్తామంటూ విద్యార్థులను చదువుపేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని కాలేజీల్లో ఈ వ్యవహారం మరింతగా మితిమీరడంతో ఒత్తి ళ్లు తట్టుకోలేని విద్యార్థులు ఆత్మహత్య శరణ్యముగా భావించి మృత్యువు ఒడిలోకి వెళ్లిన సంఘటనలు లేకపోలేదు.

విద్యార్థుల ద్వారా వచ్చిన సొమ్ముతో ప్రతి కాలేజీ యాజమాన్యం అందమైన భవల అంతస్తుల్లో కాలేజీల నిర్వహణ అంటూ నిబంధనలు తుంగలో తొక్కుతూ విద్యార్థులను మూడు నాలుగు అంతస్తులు మెట్లు ఎక్కిస్తూ నరకం చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక పరీక్షల సమయంలో తమ ర్యాంకుల పరపతి కోసం విద్యార్థులపై లేనిపోని బారాలు మోపుతున్నట్లు తెలుస్తుంది.

ఏ కాలేజీ కూడా ప్లే గ్రౌండ్ లేకపోవడం కేవలం చదువుకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామంటూ ఒత్తిళ్లకు గురిచేయడం సరికాదని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తు న్నారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తాము చేసే తప్పులు బయటపడకుండా ఉండేందుకు విద్యార్థి, ప్రజా, రాజకీయ సం ఘాల నాయకుల కూ కూడా పెద్ద ఎత్తున చందాలు ఇవ్వడం తో సహా కొన్ని పేరున్న పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం వల్లనే వారి చేసే తప్పులు బయటకు రావడం లేదని అ ర్థం అవుతుంది. నిద్రావస్థలో ఇంటర్మీడియ ట్ విద్యాశాఖ ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుందని ఆరోపణలు వినపడుతున్నాయి. 

ఈ కాలేజీల నుండి ప్రతి ఏటా అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు మూడుతున్నాయని దీనివల్లే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఎన్ని తప్పులు చేసినా అవి ఒప్పులుగా మారుతున్నాయని తెలుస్తుంది.