19-11-2025 12:00:00 AM
ధర్మం రుచిరుపాంశుదండం ప్రయ్జుత!
(కౌటిలీయం - 5- ధర్మాచరణపై ఆసక్తి కలిగిన పాలకులు.. సమర్ధత కలిగినా విధేయత లేని అధికారులను రహస్యంగా శిక్షించాలి అంటున్నాడు, ఆచార్య చాణక్య. రాజ్యమైనా, సంస్థయైన ఏర్పరుచుకున్న నియమ నిబంధనలు అ నుసరించి ముందుకు సాగాలి. ముఖ్య కా ర్యాలయం నుంచి పాలనా నిర్వహణ న డుస్తుంది. దానినే ప్రాచీన కాలంలో దుర్గం అనేవారు. పాలనా యంత్రాంగం నిబద్దత తో పనిచేయాలి. రహస్యాలను రక్షించా లి.
పాలనా వ్యవస్థలో ప్రధానాధికారులు, ప్ర జలకు ఇష్టమైనవారు.. ఐకమత్యంతో ప్రజలకు, పాలకులకు, సంస్థ సంస్కృతికి అ నుగుణంగా పనిచేస్తే.. రాజ్యానికి శ్రేయ స్సు కలుగుతుంది.. అలాకాక.. వారు రాజద్రోహులైతే.. ప్రజలకు ఇష్టులైనా, సమర్ధు లైనా వారిని ఉపేక్షించడం పాలకులకు క్షే మం కాదు, ధర్మమూ కాదు. అలాగని వా రిని ప్రకాశంగా శిక్షించి ప్రజల కోపానికి గు రవ్వొద్దు. అలాంటి అధికారులను రహస్యంగా దండించాలి, దానికి పాలకుడు ‘అన్వీక్షికీ’ కావాలి.. అంటారాయన. ‘అన్వీక్షికీ’ అనేది శాస్త్రీయ ఆలోచనా విధానం. తర్కబద్ధంగా ఆలోచించడం, విస్తృత పరిధిలో, ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తూ, విశ్లేషణాపూర్వకంగా, పరిమితులను చెరిపివేసుకుంటూ ఆలోచించడమే ‘అన్వీక్షికీ’. ‘అన్వీక్షికి’ తోడుగా చాణక్య.. త్రయి (వేదా లు), వార్త (అనుభవ జ్ఞానం, ఆర్థికశాస్త్ర జ్ఞానం, వ్యవసాయం, వ్యాపారం), దండనీతిని క్షుణ్ణంగా ఆధ్యయనం చేయాలి.
సంక్షోభ నివారణ..
జ్ఞానం, నైపుణ్యం, నిబద్ధత, సమర్ధత, విధేయత కలిగిన ఉద్యోగులను సంస్థకు విలువైన ఆస్తులుగా పరిగణించాలి. అయి తే వారిలో విధేయత లోపించినప్పుడు వారే సంస్థకు భారంగా పరిణమిస్తారు. అ విధేయులైన.. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే.. ఉద్యోగులకు సంస్థపై విశ్వసనీయ త తగ్గవచ్చు. సంస్థపై నకారాత్మక ప్రచారం జరగవచ్చు.. వ్యాపార నిర్వహణపై అది తా త్కాలికంగా ప్రభావం చూపవచ్చు. వివేకవంతుడైన నాయకుడు.. విధేయత లోపిం చి యాజమాన్యానికి వ్యతిరేకంగా కుట్రల ను పన్నే ఉద్యోగుల్లో.. అసంతృప్తికి మూ లకారణాలను అన్వేషించాలి. వ్యూహాత్మకం గా, ఉద్యోగుల మనోధైర్యం చెడకుండా... సంక్షోభాన్ని నివారించే అవకాశాలను పరిశీలించాలి.
వారిపై గల అభియోగాలను సమర్ధులు, విశ్వాసపాత్రులచే రహస్యంగా, లోతుగా విచారించి, బలమైన సాక్ష్యాధారాలను సేకరించాలి. సంస్థలో అలాంటి ఉద్యోగుల ప్రాధాన్యతను తగ్గించడం, వారి అనుయాయులను గుర్తించి.. వారికి ఉన్న త పదవులను లేదా ఉన్నత వేతనాలను ఆశ చూపి, రహస్యంగా వారి మధ్య భేదా లు సృష్టించి, అవిధేయులైన అధికారులకు ఎదురు నిలిచే విధంగా ప్రేరణ నివ్వాలి. సాధారణంగా ఉద్యోగులపై చ ర్యలు యాజమాన్య- ఉద్యోగుల సంబంధాలపై ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఉ త్పత్తి, ఉత్పాదకతలు తగ్గే అవకాశం ఉం టుంది. అయితే దాని ప్రభావం సంస్థపై ఏ మేరకు పడుతుందో అంచనా వేసి... వైఖరి మార్చుకోని ఉద్యోగులపై నిర్ణయాత్మకమైన చర్యలను, నియమ నిబంధనలకు అనుగుణంగా వేగంగా తీసుకోవాలి.
పారదర్శకత, విశ్వసనీయత లోపించకుండా ఆ యా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవలసివచ్చిందో ఉద్యోగులకు, వాటాదా రులకు స్పష్టంగా తెలియజేయాలి. అవిధేయతతో జతకట్టిన సమర్ధతనైనా సంస్థ ఉ పేక్షించదనే సూచనను క్రింది స్థాయి దాకా చేర్చాలి. అలాగే.. కింది స్థాయి ఉద్యోగుల కు అవసరమైన నైపుణ్యాలను సంతరించుకునేందుకు శిక్షణల నిప్పించడం ద్వారా సంస్థలో సమర్ధత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విధేయులైన ఉద్యోగుల ను ఉన్నత పదవుల్లో నియమించడం వల్ల సం స్థపై వ్యతిరేకత తగ్గుతుంది. అలాగే అంతర్గత విధి విధానాలను సమీక్షించి, లోపాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
అంకితభావం..
సమర్ధత, జ్ఞానం, నైపుణ్యం లేని వారికన్నా.. నైపుణ్యం, జ్ఞానం కలిగినా విధే యత లేని ఉద్యోగులే ప్రమాదకరం. వారు ఏ విధంగానూ మారని సమయంలో వారి ని వదిలించుకోవడమే ఉత్తమం. తొలగించబడిన ఉద్యోగులు వినియోగదారు ల్లో సంస్థ పట్ల, యాజమాన్యం పట్ల అనైతిక ప్రచారం చేయవచ్చు. అలాంటి పరి స్థితుల్లో సంక్షోభాలను నిర్వహించగలిగిన బృందాన్ని ఏర్పరచడం, భావవ్యక్తీకరణలో సమర్ధులైన వారిచే సంస్థ సంస్కృతి ని స్పష్టంగా, బాహిరంగా తెలియచేయడం వల్ల ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా త్వరలోనే దానిని అధిగమించే అవకాశం ఉన్నది.
సాధారణంగా అనుభవం కలిగిన ఉద్యోగుల్లో ‘అన్నీ మాకు తెలుసు, అన్ని సమస్యలకు మా వద్ద పరిష్కారాలున్నాయి’ అనే భావన ఉంటుంది. దానివల్ల కొత్త దానిని నేర్చుకోవాలనే ఉత్సాహం తగ్గుతుంది.. సృజనాత్మకత లోపిస్తుంది. మూర్ఖత్వం, ఇతరులతో పోల్చుకోవడం పెరిగిపోయి సంస్థలో విషపూరిత వాతావరణం నెలకొంటుంది. దానికి వ్యతిరేకం గా.. ‘నిరంతరం నేర్చుకునే జిజ్ఞాస, సృజనశీలత, కొత్తదనాన్ని ఆవిష్కరించే తపన’ కలిగితే మనసు విశాలమౌతుంది.
ముంబై లో 2008లో తాజ్ హోటల్‌పై ఉగ్రవాదు లు చేసిన దాడి సందర్భంలో ఆ హోటల్ ఉద్యోగులు స్పందించిన విధానం వారి అంకితభావానికి, సంస్థ పట్ల విధేయతకు చక్కని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దాదాపు 600 మంది ఉద్యోగులు అవకాశం ఉన్నా పారిపోకుండా.. ప్రాణాలను ఫణంగా పెట్టి, ధైర్యసాహసాలను ప్రదర్శి స్తూ.. దాదాపు 1100 మంది అతిథులను రక్షించారు. నిజానికి వారానాడు చూపిన అంకితభావన ఉద్యోగ బాధ్యతకన్నా ఎన్నోరెట్లు ఉన్నతమైనది. వారంతా పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద చదువులు చదివినవారేమీ కాదు.. వారికిచ్చిన శిక్షణ వారంతా అతిథులకు రాయబారులుగా ప్రవర్తించేందుకు ఇ చ్చినదే కాని సంస్థకు రాయబారులుగా ఉండేందుకు ఇచ్చిన శిక్షణ కాదు. విధేయ త కలిగిన చిన్న ఉద్యోగుల నిబద్ధత అది.
విధేయత, సమర్థత..
మైక్రోసాఫ్ట్ అధినేతగా సత్యనాదెళ్ళ ప దవీస్వీకారం చేసిన సమయంలో.. సంస్థ లో విధేయత, సమర్ధతల మధ్య సమతుల్యతను సాధించడం అతనికి పెద్ద సవాలు గా కనిపించింది. అప్పుడతను ఉద్యోగుల్లో సృజనాత్మకత, మానసిక స్థాయిని పెంచుకునే విధానం, సహకార మనస్తత్వం ప్రా ముఖ్యతను ఉధ్ఘాటించాడు. విధేయులైన ఉద్యోగులకు శిక్షణను ఇప్పించి వారి స్థా యిని పెంచేందుకు కృషి చేశాడు. జ్ఞానం, నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల వలసలను అరికట్టేందుకు పరిశ్రమించాడు. మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు ధనుర్విద్యలో సమర్ధత, నైపుణ్యం కలిగినవారు. అయి నా వారి నిజాయితీ, విధేయతలు వేర్వేరు గా ఉన్నాయి.
కర్ణుడు అధర్మపక్షంలో దు ర్యోధనుని వెంట నిలిచాడు. దానితో అతని నైతికత మసకబారి మహాయుద్ధానికి కారణమయ్యాడు.. మృత్యువు దరి చే రింది. అర్జునుడు ధర్మపక్షానికి విధేయుడు గా నిలిచాడు.. యుద్ధంలో పాండవుల విజయానికి కారణమయ్యాడు. ఈ ఉదాహర ణ వ్యక్తిగత నైతికత, నిబద్ధత, నైపుణ్యా లు, విలువల ప్రాముఖ్యతను తెలియజేస్తున్న ది. ప్రతిజ్ఞా పాలన పట్ల నిబద్ధత, రా జ్యం పట్ల విధేయత కలిగిన భీష్ముడు సభ లో స్త్రీకి జరిగిన అధర్మం పట్ల వహించిన ఉ పేక్ష అతని వ్యక్తిత్వంపై మాయని మచ్చగా నే మిగిలింది. ఏకలవ్యుని గురుదక్షణ అత ని విధేయతను ఆకాశంలో నిలిపింది.. ద్రో ణుడిని నేలపైకి దింపింది.
వ్యాసకర్త: పాలకుర్తి రామమూర్తి